రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి.
ఆ చిత్రాన్ని హర్తిరంగా.కామ్ వెబ్సైట్లో పోస్ట్ చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ సూచించిన విషయం విధితమే.ఈ విషయాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలను వేసి కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పేరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, చింతకుంట సాగర్, సంపునూరి దేవయ్య, పేరుక రంజిత్, ముప్పిడి సత్తయ్య, పూడూరి అజయ్, ఐతం వంశీ తదితరులు పాల్గొన్నారు.