డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభానికి సర్వసన్నద్ధం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag jayanthi ) ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ గంభీరావుపేట లోని ఎస్సీ కాలనీ ,లింగన్నపేట లో ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 Double Bedroom Houses Should Be Furnished To Begin With , Double Bedroom Houses,-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ కాలనీలో 168, ఎస్సీ కాలనీలో 104, లింగన్నపేట గ్రామంలో 50, నర్మాల గ్రామంలో 30, కోళ్ళమద్ది గ్రామంలో 17 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

క్లీనింగ్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, విధి దీపాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, బ్లాక్ లకు నెంబరింగ్ తదితర మైనర్ రిపేర్ పనులు పూర్తి చేయాలని సూచించారు.సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉంటూ పరిశీలించి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు.

త్రాగునీరు శాంపిల్ తీసుకుని టెస్టింగ్ చేయాలని, అన్ని బ్లాక్ లకు సక్రమంగా నీటి సరఫరా అవుతుందో లేదో ముందే పరిశీలించాలని చెప్పారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలోని వచ్చే రోడ్లకు ఇరు క్లీనింగ్ పనులు వెంటనే చేపట్టాలన్నారు.

ఇండ్లు ఫ్రెష్ లుక్ తో కనపడేలా పెయింటింగ్ చేయాలన్నారు.పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రారంభోత్సవ కార్యక్రమం సర్వ సన్నద్ధం చేయాలన్నారు .ప్రతి ఇంటినీ క్లీన్ చేసేందుకు మ్యాన్ పవర్ పెంచుకోవాలన్నారు.ప్యాచ్ వర్క్ లు మిషన్ మోడ్ లో పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్,ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, గంభీరావుపేట సర్పంచ్ శ్రీధర్ ఇంజనీరింగ్ అధికారులు, పంచాయితీ అధికారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube