యాదాద్రి భువనగిరి జిల్లా: ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ తో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అధ్వర్యంలో ఫిభ్రవరి 7న హైదారాబాద్ లో జరగనున్న “లక్ష డప్పులు వేల గొంతుల సభకు” రాష్ట్రంలోని ప్రతి మాదిగ సంకకు డప్పు వేసుకొని తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు,ఎంఎస్పీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ పిలుపునిచ్చారు.శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎ)మండలం రహీంఖాన్ పేట్ గ్రామంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ అధ్వర్యంలో నిర్వహించిన డప్పు ప్రదర్శన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ లక్ష డప్పులు వెయ్యి గొంతుల మండే మాదిగల గుండె చప్పుడు హైదారాబాద్ లో జరుగబోయే మహా ప్రదర్శనని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సన్నాహాక ప్రదర్శనకు మంద కృష్ణ మాదిగ హాజరవుతారని
ఈ ప్రదర్శన జయప్రదం చేయడం కోసం గ్రామ గ్రామాన తరలి రావాలనే పిలుపుతో సాంస్కృతిక ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని మాదిగల సత్తా ఏమిటో చూపించేందుకు ప్రతి మాదిగ ఇంటికి తాళం పెట్టి,ఇంటిలో అందరూ సంకకు డప్పు వేసుకొని దండులా కదలి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కో ఆర్డినేటర్ మందుల లింగ స్వామి మాదిగ,మండల నాయకులు కానుకుంట్ల నవీన్ మాదిగ,గ్రామ శాఖ సీనియర్ నాయకులు గురుకు యాదగిరి మాదిగ,బూడిద ఆంజనేయులు మాదిగ, గంధమల్ల ముత్తయ్య మాదిగ,మాదిగ మహిళా సమాఖ్య నాయకురాళ్లు గురుకు సంతోష మాదిగ, యాతల వినోద మాదిగ తదితరులు పాల్గొన్నారు.