రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఐటీ&విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42 వ పుట్టినరోజు సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ అడాక్ కమిటీ సభ్యులు, టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతేజం సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు అన్న తాత ఎన్టీ రామారావు నినాదాన్ని మనసారా నమ్ముతున్న యువనాయకులు నారా లోకేష్ ని నేటిని చక్కదిద్దుకుంటూ,రేపటికి ఆశయాన్ని కల్పించుకుంటూ నడిచినవాడే నడిపించేవాడే, నిలిచేవాడే అనే నాయకుడుగా పేరుపొందిన వారు నారా లోకేష్ అని అన్నారు.
ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ,పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెడితే బాగుంటుంది అని మొదటగా కార్యకర్తలకి ప్రమాదభీమని తెలుగుదేశం పార్టీ తరుపున ప్రవేశ పెట్టిన గోప్ప వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు శ్యాగ ప్రశాంత్ పాల్గొన్నారు.