రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఉద్యమ నేత ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మీద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిన మారవేని రంజిత్ కుటుంబాన్ని ఫోన్ ద్వారా కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పరామర్శించడం జరిగింది.
అలాగే బుధవారం బిజెపి రాష్ట్ర కన్వీనర్, బండి సంజయ్ పి.
ఏ ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్గం వెంకటలక్ష్మి నవీన్ , జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి,వాణిజ్య సెల్ అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి ,కొండాపురం సత్యం రెడ్డి , బాపురెడ్డి,భాస్కర్ మారవేని రంజిత్ ఇంటికి వెళ్లి పరామర్శించి వారికి గుండె ధైర్యాన్ని, మనోబలాన్ని అందిస్తూ బిజెపి ఎప్పుడు మీ వెంట ఉంటుంది అని చెప్పడం జరిగింది.