జుట్టు ఒత్తుగా, పొడవుగా మరియు నల్లగా పెరగాలన్నా, కుదుళ్లు బలహీనంగా మారకుండా ఉండాలన్నా, కురులు నిగనిగలాడుతూ మెరవాలన్నా.పై పై పూతలే సరిపోవు.
పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ `టీ`లు ఆరోగ్యాన్నే కాదు.
మీ జుట్టును కూడా సంరక్షిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ టీలు ఏంటో.
అవి మనకు అందించే లాభాలు ఎలా ఉంటాయో.తెలుసుకుందాం పదండీ.
ఆమ్లా టీ లేదా ఉసిరి టీ.మీ రోజువారీ ఆహారంలో ఈ టీని జోడించడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.వైరల్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.
రక్త శుద్ధి జరుగుతుంది.

పిప్పరమింట్ టీ లేదా పుదీనా టీ.ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన టీగా చెప్పబడింది.గుండె ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంలోనూ, క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలోనూ, డయాబెటిస్ ను కంట్రోల్ ఉంచడంలోనూ పిప్పరమింట్ టీ సూపర్ గా హెల్ప్ చేస్తుంది.
అలాగే జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.ఈ హెర్బల్ టీని డైట్‌లో చేర్చుకుంటే ఒత్తిడిని దూరం చేసి తలకు రక్త ప్రసరణను పెంచుతుంది.మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.తలస్నానం చేసిన తర్వాత పిప్పరమింట్ టీని తలపై పోసుకుంటే చుండ్రు సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

మందారం టీ..ఆరోగ్యానికి, జుట్టుకు మేలు చేసే హెర్బల్ టీలలో ఇది ఒకటి.మందారం టీని తీసుకోవడం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది.దట్టంగా పెరుగుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.
ఇక ఆరోగ్య పరంగా మందారం టీ ఎముకలను బలంగా మారుస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.మరియు మానసిక సమస్యలను దూరం చేస్తుంది.







