నిర్దేశిత గడువులోగా ఓటర్ సమాచార స్లీప్ ల పంపిణీ పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో నిర్దేశిత గడువులోగా ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti) అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్ల పై కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.

 The Distribution Of Voter Information Slips Should Be Completed Within The Speci-TeluguStop.com

ఇప్పటికే ఓటరు సమాచార స్లిప్పులను బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంపిణీ ప్రారంభమైనందున ఓటరు సమాచార స్లిప్పులను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పంపిణీ చేపట్టాలన్నారు.జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని 547 పోలింగ్ కేంద్రాలలో కేంద్రం ఎన్నికల సంఘం( Central Election Commission) నిర్దేశించిన మేరకు కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

హోమ్ ఓటింగ్ షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు.

హోమ్ ఓటింగ్ ను ఎలాంటి ఆరోపణలు లేకుండా టీమ్ లు పారదర్శకంగా చేపట్టాలన్నారు.

సెక్టార్ అధికారులు హోమ్ ఓటింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జరిగేలా మానీటరింగ్ చేయాలన్నారు.ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించే వేదికల వద్ద ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు.

అత్యవసర సేవలో ఉన్న ఉద్యోగులకు రిటర్నింగ్ కార్యాలయాల వద్ద ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాండమైజేషన్, ఈవిఎంల కమిషనింగ్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

తుది బరిలో ఉన్న అభ్యర్థులు తేలినందున నోడల్ అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయిత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు( Returning officer) ఆనంద్ కుమార్,మధు సూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube