ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వైట్‌హౌస్‌కు వచ్చీ రాగానే కోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నారు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: యూఎస్ పౌరసత్వాన్ని నిలుపుదల చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలతో పాటు కొన్ని వలసదారుల సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.ఈ క్రమంలో ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును సియాటిల్ ఫెడరల్ కోర్ట్ ( Seattle Federal Court )తాత్కాలికంగా నిలిపివేసింది.

 Federal Court Blocks Us President Donald Trump's Birthright Citizenship Order, D-TeluguStop.com

ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.న్యాయస్థానం తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.దీనిపై తాము కోర్టులో అప్పీల్‌కు వెళ్తామని ఆయన వెల్లడించారు.

Telugu Citizenship, Donald Trump, Federal, Federaldonald, Indians, Seattle Feder

కాగా.అమెరికా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని 14వ సవరణ కింద ఆ దేశంలో పుట్టిన పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వం లభిస్తుంది.దీనిపై ఎన్నికల ప్రచారంలోనే విమర్శలు చేసిన డొనాల్డ్ ట్రంప్.

చెప్పినట్లుగానే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షాకిచ్చారు.అనధికారిక లెక్కల ప్రకారం తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చిన వారు దాదాపు 1.40 కోట్ల మంది పైమాటేనని విశ్లేషకుల అంచనా.ఈ లిస్ట్‌లో భారతీయుల సంఖ్య దాదాపు 8 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా.

మన తర్వాత మెక్సికో, సాల్వెడర్ జాతీయులు ఉన్నారు.

Telugu Citizenship, Donald Trump, Federal, Federaldonald, Indians, Seattle Feder

ట్రంప్ నిర్ణయం భారతీయులకు( Indians ) శరాఘాతం కానుంది.అగ్రరాజ్య జనాభాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులే.అంతేకాదు.

వీరిలో మూడో వంతు అమెరికా గడ్డపై పుట్టినవారే.తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి, గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి పుట్టిన పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అమలైతే దాదాపు 7.25 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.ప్రస్తుతానికి కోర్డు ఈ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.ట్రంప్ యంత్రాంగం అప్పీల్‌కు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని వారంతా బిక్కుబిక్కుమంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube