రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నాలుగు గ్రామాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల 75 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు.పదిర,హరిదాస్ నగర్, వెంకటాపూర్, అల్మాస్పూర్ గ్రామాలలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.స్పెషల్ డెవలప్మెంట్ కింద మంజూరైన పనులను ఈ గ్రామాలలో ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
15 ఆగస్టు గురువారం ముఖ్యమంత్రి మూడవ దశ రైతు రుణమాఫీని పూర్తి చేయడం జరుగుతుందన్నారు.దీనిని అన్ని గ్రామాలలో రైతులతో కలిసి సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు గుండాటి రాంరెడ్డి, చెన్నిబాబు, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి,వెంకటేష్ ,వంగ మల్లారెడ్డి, గంగయ్య,పర్షరాములు, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.