రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో గురువారం జరిగే వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జెండా ఆవిష్కరించనున్నారు.
పోలీస్ గౌరవ వందన స్వీకరించి, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై ప్రసంగించనున్నారు.కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల గ్రామమైన రుద్రంగి బిడ్డ ఇప్పటికే పలు పదవుల బాధ్యతలు చేపట్టి మంచి ఖ్యాతి గడించారు.
ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గెలుపొందగా, జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్ ను ప్రభుత్వ విప్ ను చేశారు.
తమ గ్రామ బిడ్డ ఎంతో ఓపిక, పట్టుదలతో ప్రజా సమస్యలపై పోరాడి, ఉన్నత స్థానానికి ఎదగడం తమకు గర్వకారణంగా ఉందని,రానున్న రోజుల్లో ఆది శ్రీనివాస్ మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టి రుద్రంగి మండలంతో పాటు వేములవాడ నియోజకవర్గాన్నీ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని, రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు…
.