ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల గాంధీ చౌక్ లో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆశ వర్కర్ల సమ్మె శుక్రవారం 12వ రోజుకు చేరుకుంది.ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యంగా కక్ష సాధింపు ధోరణి గా వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసిస్తూ ఈరోజు గాంధీ చౌక్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

 Asha Workers Protest At Rajanna Siricilla Gandhi Chowk, Asha Workers, Asha Worke-TeluguStop.com

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్ల వేతనాలు పెంచకుండా వారిపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తున్నారని,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు తెలంగాణ రాష్ట్రం లోనే ఇస్తున్నామని అబద్ధపు ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు.

మంత్రి కేటీఆర్ ఆశా వర్కర్లు వినతి పత్రం ఇస్తామన్న తీసుకునే పరిస్థితిలో లేడు ఈ రకంగా ఇంకో మంత్రి జగదీశ్ మమ్మల్ని ఓడించండి మేము ఇంట్లో కూర్చుంటామని తలతిక్క సమాధానాలు ఆశ వర్కర్లకు అంటున్నాడు.

ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ ఆశా వర్కర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది.ఎన్నికల కోడ్ రాకముందే ఆశ వర్కర్ల సమస్య లు వారికి వేతనం 18000 పెంచకుంటే మంత్రి జగదీష్ రెడ్డి అన్న విధంగానే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంట్లో కూసుండ పెట్టే పని ఆశా వర్కర్లు చేస్తారని అన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆశా వర్కర్ల కు వేతనాలు పెంచి సమ్మెను విరమింపచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, సిపిఎం జిల్లా నాయకులు సూరం పద్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, సిఐటియు నాయకులు గోవిందు, లక్ష్మణ్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి జయశీల, గౌరవాధ్యక్షురాలు భారతి, కోశాధికారి కస్తూరి , గాయత్రి , లత , చందన , లక్ష్మి , లావణ్య , చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube