ఆశా వర్కర్ల రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని తహాసిల్దార్ కార్యాలయం ఎదుట కామారెడ్డి,సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం గంటసేపు ఆశ వర్కర్లు రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.

 Asha Workers Rastharoko In Rajanna Sirisilla District, Rajanna Sirisilla Distri-TeluguStop.com

పోలీసులు నచ్చజెప్పి ఆశా కార్యకర్తలను రోడ్డుపై నుండి శిబిరంలోకి తరలించారు.మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు.

కరోనా సమయంలో ఆశా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కనీసం ఆశా కార్యకర్తలను పిలిచి చర్చించడం లేదన్నారు.మంత్రి కేటీఆర్( KTR ) సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆశా కార్యకర్తలైన మహిళలు అని చూడకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారని అన్నారు.

రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రతను కల్పిస్తామన్నారు.వారి డిమాండ్లు న్యాయసమతమైనవని అన్నారు.

ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు ఓరుగంటి రాణి, గోవర్ధనగిరి గీత, జల్లి తార, అంతర్పుల స్రవంతి ,సరిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుల షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు సూడిద రాజేందర్, అధికార ప్రతినిధి మానుక నాగరాజు , పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, బిపేట రాజు ,భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి,సాయి కిరణ్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube