తండ్రి చనిపోయాడు.తల్లి వద్దని వదిలేసింది..దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోండి

నా తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.నా తల్లి నన్ను భారం అనుకున్నది ఏమో!!నన్ను నా నాయనమ్మ దగ్గర వదిలివేసి వెళ్ళింది.

 Support Poor Child With Donations,poor Child,orphan,rajanna Sircilla,yellareddyp-TeluguStop.com

మాకు ఉందామంటే ఇల్లు లేదు.రేషన్ బియ్యం తెచ్చుకుందాం అనుకుంటే రేషన్ కార్డు లేదు .ఎట్లా బతకాలి అని మిట్టపెల్లి సావిత్రి అహిద్య(14) నెలల బాలిక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది.వివరాలిలా వున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అగుళ్ల భాస్కర్(26)కు రాచర్ల గొల్లపల్లి కి చెందిన జాష్ణవి తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.గ్రామగ్రామాన తిరుగుతూ ఇంటి వంట పాత్రలు (బోల్లు)అమ్మే పని చేసుకునేవారు.

వీరికి ఆహిద్య (14)నెలల అమ్మాయి వీరికి జన్మించింది.కాగా భాస్కర్ అయిదు నెలల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు.

నేను చేసుకున్న భర్త నే చనిపోయాడు.నా కడుపున పుట్టిన ఈ పాప నాకు ఎందుకు అని అనుకుందో ఏమో కానీ ఆహిద్య ను ఆమె నానమ్మ సావిత్రి వద్ద వదిలివేసి వెళ్ళింది.

సావిత్రి అల్లం రబ్బలు అమ్మే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది.

ఆ వ్యాపారం కూడా చిన్న పాప ఉండడం వల్ల ఇట్టి వ్యాపారం చేసుకోవడానికి వీలు కావడం లేదని సావిత్రి వాపోయింది.

చిన్న పాప ను పట్టుకుని ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఇదే గ్రామంలో మిట్టపెళ్లి లక్ష్మణ్ ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే రెండు వేల రూపాయల పెన్షన్ నుండి వేయి రూపాయలు కిరాయి ఇచ్చి మరో వేయి రూపాయల తో ఆహిద్యా ను పెంచుకుంటుంది.కనీసం తినడానికి బియ్యం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు కూడా లేదని ఎవరైనా దయతలచి బియ్యం ఇస్తే బియ్యం తెచ్చుకుని వంట చేసి పెడుతున్నానని సావిత్రి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు సావిత్రి తెలిపింది.

గురువారం తమ పరిస్ఠితి తెలుసుకుని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవారెడ్డి ఐదు వేల రూపాయల ను అందజేశారని సావిత్రి తెలిపింది.ఆహిధ్య కు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తాను పిల్లల వైద్య నిపుణులకు చూపిస్తానని ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.

దాతలు ఎవరైనా ఉంటే 9000996122 మిట్టపెళ్లి శేఖర్ కు ఫోన్ పే చేయాలని ఆమె కోరారు.ఇట్టి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వీరి కుటుంభానికి సహాయం అందేలా చూస్తానని ఒగ్గు బాలరాజు యాదవ్ సావిత్రి కి బరోసా కల్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube