రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని,పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ( Nyalakonda Aruna )వైద్యులకు సూచించారు.
గురువారం సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ( Government Hospital )అభివృద్ధి కమిటీ సమావేశం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాకే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, అందుకే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు.గత ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపాలని కోరారు.
ఆసుపత్రిలో సిబ్బంది పెంపు కోసం కృషి చేస్తానన్నారు.ప్రధాన ఆస్పత్రిలోని పలు అంశాల పరిష్కారానికి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, సూపరిండెంట్ మురళీధర్ రావు, డిప్యూటీ సూపరిండెంట్ డా.సంతోష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగభూషణం, డాక్టర్లు పాల్గొన్నారు
.