పారదర్శకంగా కేసులలో పరిశోధన ఉండాలి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రతి కేసులో పారదర్శకంగా పకడ్బందీగా విచారణ చేపట్టి నేరస్తులకు శిక్ష పడేవిదంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకొని, (యస్ఓపి) ప్రకారం సిడి ఫైళ్ళల్లో ఇన్వెస్టిగేషన్( Investigation ) ఏ విధంగా ఉందో పరిశీలించారు.

 Investigation Should Be Transparent Says District Sp Akhil Mahajan, Sp Akhil Mah-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ…కేసులలో సమగ్ర విచారణ చేపడుతూ నిందితులకు శిక్షపడేవిధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని,ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు.

కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్సీ / ఎస్టి ఉమెన్ ఎగైనెస్ట్ కేసులలో, పోక్సో కేసులలో విచారణ వేగవంతం చేయాలని,జిల్లాలో మిస్సింగ్ కేసుల పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి గుర్తించాలని అధికారులని ఆదేశించారు.
దొంగతనాలకు సంబంధించిన కేసులను అన్ని కోణాలలో పరిశోధన చేసి త్వరగా చేదించాలని,దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్,ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు.
చట్టవ్యతిరేక కార్యక్రమాలు అయిన గంజాయి,గుడుంబా, పేకాట,పిడిఎస్ రైస్,నకిలీ విత్తనాలు,అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించి వాటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

విజబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ చట్టాల పైన అవగాహన కల్పించాలని, అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదలు సమయంలో దైర్యంగా విధులు నిర్వహించి ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం ఎక్కవ జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించిన 91 మంది అధికారులకు, సిబ్బంది కి మరియు గత నెలలో విది నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకి సమర్ధవంతంగా సేవలందించిన 39 మంది అధికారులకు, సిబ్బంది కి ప్రశంస ప్రోత్సాహకాలు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, రవికుమార్, రవీందర్, సి.ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube