ఏమైనా చేయండి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి.తమ సినిమాలను రోజుల తరబడి ఆడేలా చేయాలి.
మంచి వసూళ్లు రాబట్టాలి.ఇదే కాన్సెప్టుతో సినిమాలు తెరక్కెక్కుతాయి.
దర్శక నిర్మాతలు సైతం ఇదే ఆలోచిస్తారు.సేమ్ ఇలాంటి ఆలోచనతోనే ముందుకు వచ్చింది త్రిమూర్తులు మూవీ.
ఈ సినిమాలో ఏకంగా ఏడుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు కనిపించారు.జనాలను సినిమా హాళ్లకు క్యూ కట్టేలా చేశారు.
తెలుగు సినీరంగంలో కొత్త చరిత్ర సృష్టించారు.ప్రేక్షకులు మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్ని ఇచ్చారు.

వెంకటేష్ హీరోగా 1987లో త్రిమూర్తులు అనే సినిమా తెరకెకక్కింది.ఒకే మాట ఒకే బాట అనే పాటలో అప్పటి టాప్ నటులను ఓకే సారి చూపించాలని భావించాడు ఆ సినిమా ప్రొడ్యూసర్ సుబ్బి రామిరెడ్డి.నసీబ్ అనే హిందీ సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా చేశారు.హిందీలో ఈ పాటకు బాలీవుడ్ టాప్ హీరోలంతా డ్యాన్స్ చేశారు.ఇక్కడ కూడా అలాగే చేయాలని సుబ్బి రామిరెడ్డి అనుకున్నారు.ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, క్రిష్ణ , శోభన్ బాబు , కృష్ణం రాజు, చిరంజీవిని ఈ పాటలో చూపించాలని అనుకున్నారు.
ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ కొన్ని అనివార్య కారణాల వల్ల నటించలేదు.వారి స్థానంలో బాలక్రిష్ణ , నాగార్జున నటించారు.
వెంకటేష్ తో మొదలయ్యే ఈ పాటలో తొలుత శోభన్ బాబు, ఆ తర్వాత విజయ శాంతి , క్రిష్ణ, విజయ నిర్మల , చిరంజీవి , కృష్ణం రాజు శారద కనిపిస్తారు.ఆ తర్వాత బాలక్రిష్ణ, నాగార్జున కనిపిస్తారు .వీరితో పాటు రాధిక , రాధ , జయ మాళిని , చంద్రమోహన్ , మురళీ మోహన్ తో పాటు ఇంకొంత మంది నటులు కనిపిస్తారు.కేవలం ఈ పాట కోసమే జనాలు సినిమా టాకీసులకు గుంపులు గుంపులుగా తరలి వచ్చారు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఆరోజుల్లోనే మంచి వసూళ్లను రాబట్టింది.
అందిరి హీరోలకు మంచి గుర్తింపు తెచ్చింది.