ముఖ్యంగా చెప్పాలంటే కొత్తిమీర ( Coriander )ఆహార పదార్థాల రుచిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని దాదాపు చాలామందికి తెలుసు.అలాగే ఇందులో ఉండే గుణాలు ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని అందించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు ఏ,సీ,k, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.కాబట్టి కొత్తిమీర ను ప్రతి రోజు జ్యూస్ ల తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ జ్యూస్ ని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొతిమీర జ్యూస్( Coriander juice ) లో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యంటు ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి.
కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity )కూడా పెరుగుతుంది.జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే మధుమేహం( Diabetes )తో బాధ పడే వారిలో రోజు రోజుకు చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి.
దీని కారణంగా మధుమేహం కూడా తీవ్రతరమవుతుంది.అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజు కొత్తిమీరతో తయారుచేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా కొత్తిమీర గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే కొత్తిమీర రసంలో ఉండే గుణాలు పీరియడ్స్ లో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇందులో ఉండే గుణాలు తిమ్మిర్లు, ( Cramps )వాపులు, నొప్పి వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.కొత్తిమీర రసంలో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది.
కాబట్టి ప్రతి రోజు ఈ రసం తీసుకోవడం వల్ల ఎముకల దృఢంగా మారుతాయి.అంతే కాకుండా బోలు ఎముకల వ్యాధుల( Osteoporosis ) నుంచి సులభంగా బయటపడవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే కొత్తిమీర జ్యూస్ ( Coriander juice ) తాగడం వల్ల నేత్రాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.