పోలీసుల విధి నిర్వహణలో క్రీడలు ఎంతగానో దోహదపడుతాయి.

సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో పోలీస్ అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,జిల్లా ప్రారంభమైన నుండి జిల్లాలో మొట్టమొదటి అన్యువల్ స్పోర్ట్స్ మీట్.,రెండు రోజుల పాటు జరుగనున్న క్రీడా పోటీలురాజన్న సిరిసిల్ల జిల్లా వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో ఈరోజు ఘనంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిలుగా హాజరై శాంతికపోతాలను,బెలూన్స్ ఎగురవేశిన,అనంతరం పోలీస్ సిబ్బంది ఒలంపిక్ కాగడ చేత భూని క్రీడాజ్యోతిని తీసుకొని పరేడ్ గ్రౌండ్ చుట్టు రన్ చేశారు.

 Sports Help A Lot In The Performance Of Police Duty. Rajanna Sirisilla District-TeluguStop.com

అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు.

ఆటల్లో గెలుపోటములనేవి సహజమెమని గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు.అధికారులకు సిబ్బంది ప్రతి ఒక్కరికి డ్యూటీ,ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుందని క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వం కోసం ఏర్పడుతాయని అన్నారు.

ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి అని క్రీడలు అడడం వలన ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.మన పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని శారీరకంగా ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

క్రీడలు అంటేనే ఒక పండుగ వాతావరణం అని సిబ్బంది 24X7 విదులు నిర్వహించడం వలన తమ ఆరోగ్యం పై శ్రద్ద పెట్టలేక పోతుంటారని ఈ క్రీడల వలన ఆరోగ్యం ఉత్సాహాంగా ఉంటుందని, ఉల్లాసంగా గడపడానికి తోడ్పడుతుందని, ఎన్ని చాలేంజీలు వచ్చిన కూడా సిబ్బంది ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రారంభమైన తరువాత జిల్లాలో మొదటిగా నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ లో అందరూ గేమ్ స్పిరిట్ తో పాల్గొనాలని అన్నారు.

ఈ క్రీడలు 2 రోజులు నిర్వహిస్తున్నామని,ఇక్కడ క్రీడలలో ఓడిన గెలిచిన పండుగ వాతావరణం మాత్రమే ఉంటుంది, సిబ్బంది ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండాలనదే ఈ క్రీడల యొక్క గొప్పదనం.జిల్లా ఎస్పీ షటిల్ ,టేబుల్ టెన్నిస్,క్యారం సిబ్బంది తో కలసి ఆడి అందరిని ఉత్సాహ పరిచారు.

ఈ పోటీలు రెండు రోజుల పాటు డార్ హంటర్, సిరిసిల్ల స్టైకైర్స్,వేములవాడ విక్టర్స్, వేములవాడ రుద్రస్, సిరిసిల్ల సోల్జర్స్,డార్ రేంజర్స్ జట్ల మధ్య క్రికెట్, షటిల్ బ్యాట్మెంటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, తగ్గాఫర్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు జరుగుతాయి.అన్ని ఆటలను అందరు చక్కగా సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విస్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, మోగిలి, వెంకటేష్, బన్సీలాల్, కిరణ్,కరుణాకర్, మాధుకర్, ఆర్.ఐ లు రజినీకాంత్, కుమారస్వామి, యాదగిరి, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube