గర్భిణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి

ఆత్మీయతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి.గర్భిణులకు సేవలు అందించే విషయంలో మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లు క్రియాశీలంగా పని చేయాలి.

 It Should Be Ensured That Pregnant Women Do Not Feel Any Discomfort Vemulawada H-TeluguStop.com

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేలా వైద్యులు పనిచేయాలి.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti )రాజన్న సిరిసిల్ల జి( Rajanna Sirisilla )ల్లా:ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలు, చికిత్స, డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా సేవలు అందేలా చూడాలనీ వైద్యాధికారులు, మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి ల ప్రసూతి సేవల కోసం వచ్చే గర్భిణులకు వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పిఆర్ వ్యవస్థ (మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్) ట్రయల్ రన్ అమలును పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల వివరాలు నమోదు నుంచి , పరీక్షలు, స్కానింగ్, లేబర్ రూం తదితర సేవలను పరిశీలించారు.

గర్భిణిలలో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు.

పిఆర్ వ్యవస్థ ప్రభావంతంగా అమలు అయ్యేందుకు వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారుఈ వ్యవస్థ లో అమలులో మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఎంతో కీలకం అన్నారు.జిల్లా ఆస్పత్రిలో వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నియమించిన 13 మంది మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు.3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు.హెల్త్ సూపర్ వైజర్లను, వారి సహాయకులుగా ఏర్పాటు చేసిన నర్సింగ్ విద్యార్థును సులభంగా గుర్తించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రెస్ కోడ్ బ్లెజ్ కోట్, స్లీవ్ లెస్ బ్లేజ్ ను విధిగా ధరించాలని చెప్పారు.ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు గర్భిణీలకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని రకాల వైద్య సేవలను మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లు, నర్సింగ్ విద్యార్థినీలు దగ్గరుండి అందించాలన్నారు.

పరిశీలన లో కలెక్టర్ వెంటజిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావువేములవాడ ఆసుపత్రి( Vemulawada Hospital ) పర్యవేక్షకులు డా.మహేష్, మెటర్నిటీ ప్రోగ్రాం అధికారి డా.మహేష్, ఆర్ఎంఓ డా.సంతోష్, తదితరులు పాల్గొన్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube