ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో( Government Junior Colleges ) మధ్యాహ్న భోజనాన్ని వెంటనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిసి విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్, జిల్లా డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు.

 Mid-day Meal Should Be Implemented Immediately In Government Junior College , Mi-TeluguStop.com

గత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి( Kadiyam Srihari ) జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటించారని,ఈ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుండి ఇంతవరకు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని మర్చిపోవడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థిని విద్యార్థులు వారికి సన్న బియ్యం తో మధ్యాహ్న భోజన అమలు చేయాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మధ్యాహ్న భోజనము అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు.అమలు చేయని పక్షాన బీసీ విద్యార్థి సంఘం( BC Student Union ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్టి నరేష్,నాయకులు నవీన్ కుమార్,శ్రీకాంత్, గణేష్ ,నీరజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube