జనసేన స్థాయిని అట్టడుగుకి తొక్కిన పవన్ కామెంట్స్..!!

ఏపీ వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ జోరుగా సాగుతోంది.వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేసినంత తేలికగా నోరు జారితే పరిణామాలు ఎలా ఉంటాయో జనసేనానికి మొదటిసారి తెలిసివచ్చినట్లు అనిపిస్తోంది.

 Pawan's Comments That Trampled The Level Of Janasena..!!-TeluguStop.com

సినిమా తరహాల్లో డైలాగ్సే కదా అనుకున్నారేమో… ఇష్టారీతిన మహిళలను కించపరుచుతూ మాట్లాడారని ఆగ్రహా జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది సైన్యంతో బలంగా ఉన్న ప్రతిష్టాత్మక వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

వాలంటీర్లు హ్యుమన్ ట్రాఫికర్స్ అంటూ అవమానకరంగా మాట్లాడారు.పవన్ చేసిన ఈ నోటి దురుసు కామెంట్లు ప్రజల్లో ఆయనకున్న స్థాయి అధ: పాతాళానికి వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వాలంటీర్లు, వారి కుటుంబీకులు సైతం పవన్ నోటి దురదను గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నారు.అంతేకాదు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అనే కామెంట్ తో పవన్ ఒక్కసారిగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు మాత్రమే కాకుండా పలువురికి శత్రువుగా మారారని చెప్పుకోవచ్చు.

వర్షాలు, వరదలే కాకుండా కరోనా వంటి క్లిష్ట సమయాల్లో వాలంటీర్లు అందించిన సేవలు నిరుపమానం.

కరోనా వల్ల చనిపోయిన వారిని చూసేందుకు బంధుమిత్రులు, ఆఖరికి కన్నవాళ్లు కూడా రాని సమయంలో మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించిన సేవకులు.గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా పీకల్లోతు నీళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య గడుపుతున్న సమయంలోనూ ప్రాణాలకు తెగించి వారికి సరుకులు ఇచ్చి ఆదుకున్న సొంత మనుషులు వాలంటీర్లు.

అలాంటి వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడని ఆయన సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.

గ్రామాల్లో వృద్ధులు, బాలింతలు, ఇతర అభాగ్యులకు సేవలు అందించే ఓ పెద్ద వ్యవస్థను కావాలని తనకు వ్యతిరేకంగా మార్చుకున్న పవన్ ఇప్పుడు తన మాటలకు క్షమాపణ చెప్పలేక కొత్త భాష్యం అందుకున్నారు.

వాలంటీర్లు అందరూ కాకపోయినా వారిలో కొందరు చెడ్డ వాళ్లున్నారని చెబుతున్నారట.కానీ తాను విస్తృతంగా పర్యటిస్తున్న గోదావరి జిల్లాల్లో ఆయన సామాజికవర్గానికి చెందిన కాపు యువత ఎంతోమంది వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

మరి ఈయన నోటిదురుసు ప్రకటనతో వారి మనోభావాలు దెబ్బతినవా ? అన్నది అందరి మదిలో తచ్చాడుతున్న ప్రశ్న.

గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఏది మాట్లాడాలో.? వద్దో.? తెలియని ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే కుక్క తోకపట్టుకుని గోదారి ఈదినట్లే అని కార్యకర్తలు అంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రజల మన్ననలు అందుకున్న వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శలు చేయడం అంటే తన సమాధి తానే తవ్వుకున్నటు అని పార్టీలోని నాయకులూ, సానుభూతిపరులు సైతం అంటున్నారని తెలుస్తోంది.మహిళలను, సేవకులను ఇంతలా అవమానిస్తున్న మాట్లాడిన జనసేనాని రాజకీయ నాయకుడిగా పని చేస్తాడా అని పలువురు విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube