చైనా దేశంలో పుట్టిన మహమ్మారి కరోనా ప్రపంచం మొత్తాన్ని ఇంటిలో కూర్చోబెట్టి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి తీసుకు వచ్చింది.పేదవాడి మొదలుకొని దేశ ప్రధాని వరకు అందరూ సమానమే అన్న తరహాలో ప్రస్తుతం ప్రపంచంలో విచ్చలవిడిగా తన రూపాన్ని మార్చుకుంటూ చెలరేగి పోతుంది.
చాలా దేశాలలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ ఉండటంతో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు చాలావరకు వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉన్నా పరిస్థితి ప్రస్తుతం ప్రపంచంలో నెలకొంది.
దీంతో సమయానికి భోజనం చేయక, నిద్రపోకుండా మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది.వైరస్ రాకముందు టైంటేబుల్ ఒకలా ఉంటే వైరస్ వచ్చాక అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం.
చాలా ఆలస్యంగా నిద్రలేవడం రాబోయే రోజుల్లో ఇదే ఐదు సంవత్సరాల పాటు కొనసాగితే మనిషి శరీరంలో డి విటమిన్ లోపం ఏర్పడతాయి అని లాయిడ్స్ ఫార్మసీ డాక్టర్స్ అనే ఆన్‌లైన్ డాక్టర్స్ కన్సల్టెన్సీ సంస్థ తెలియజేసింది.అదే రీతిలో శరీరం పాలిపోవడం, వంకర్లు తిరగడం, గూని వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.
ఇలా రాకుండా ఉండాలంటే ఒకపక్క ఉద్యోగం చేస్తూనే టైం ప్రకారం భోజనం చేసి కనీసం చెమట పట్టే విధంగా వ్యాయామం చేయాలి అని ఈ సంస్థ పేర్కొంది.
.