రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ ఆరోగ్య పారిశుధ్య, పోషణ దినము అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆరోగ్య పారిశుధ్య, పోషకాహార దినము ప్రతి నెల మొదటి బుధవారం జరుపుకోవాలని దానిలో భాగంగానే ఈరోజు ఆశ వర్కర్లకు,అంగన్వాడి వర్కర్లకు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అంగన్వాడి కేంద్రాలలో గర్భిణి స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహార పదార్థాలను,న్యూట్రిషన్ కిట్టులను అందజేస్తుందని పోషకాహార లోపం కలిగిన పిల్లలకు తీవ్రమైన పోషకాహార లోపం కలిగిన పిల్లలకు పోషక ఆహారం కోసం
అదనపు కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్థాలను బాలామృతం ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పోషకాహార లోపం కలిగిన పిల్లలకు అందజేస్తుందని గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు, పోషకాహార లోపం కలిగిన పిల్లలకు తెలియజేసేలా అంగన్వాడి వర్కర్లు,ఆశా వర్కర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు అందరి సమన్వయంతో అవగాహన లు కలిగేలా రేపు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వార్డులలోని అంగన్వాడి సెంటర్ల వద్ద మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది చే స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి బ్లీచింగ్ చల్లిస్తామని అదేవిధంగా వార్డులలో శానిటేషన్ పై ప్రజలకు అవగాహన కలిగేలా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ల చే అవగాహన కార్యక్రమాలు చేపడతామని వారన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ సుచరిత ,సూపర్వైజర్ కనకమ్మ, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు,మున్సిపల్ వార్డు అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.