సాధారణంగా పండుగుల సమయాల్లో లేదా ఏమైనా మొక్కులు చెల్లించుకునే సమయంలో చాలామంది మేకలు లేదా కోళ్లను బలి ఇస్తూ ఉంటారు.హిందూవుల దేవాలయాల దగ్గర ఇలాంటివి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.
కానీ అందరి దేవుళ్లకు ఇలాంటి మేకలు, కోళ్లను బలి ఇవ్వరు.గ్రామ దేవతల దేవాలయాల దగ్గర ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే మేకను( Goat ) బలివ్వాలని చూసి ఒక వ్యక్తి మరణించాడు.ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని( Chattisgarh ) సూరజ్‌పూరా జిల్లాలోని ప్రసద్ద భోపా ధామ్‌లో యాగం( Bhopa Dham Yagam ) సందర్భంగా కొంతమంది గ్రామస్తులు ఒక మేకను బలి ఇచ్చారు.బలి ఇచ్చిన తర్వాత మేక మాంసాన్ని( Goat Meat ) అక్కడే వండుకుని తింటున్నారు.ఈ సమయంలో యాగం చేసిన గ్రామస్తుల్లో ఒకరైన బగర్ సాయి అనే వ్యక్తి మేక మాంసంలోని మేక కంటిని తిన్నాడు.అయితే కన్ను అతడి గొంతులో ఇరుక్కుపోయింది.
దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో అస్వస్థతకు గురయ్యాడు.అతడిని గమనించిన గ్రామస్తులు.
వెంటనే సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.అయితే సాయి( Sai ) మరణంపై గ్రామస్తులు అనే రకాలుగా చర్చించుకుంటున్నారు.కొంతమంది దీనిని భగవంతుడి ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఇక మరికొతమంది బలి ఆమోదం పొందలేదని చెబుతున్నారు.ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు.చాలాసార్లు ఇలా మేకలను బలి ఇచ్చామని, కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని అంటున్నారు.
ఇప్పుడు ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణం కోల్పోవాాల్సి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఏది ఏమైనా మేక కన్ను ఒకరి ప్రాణాలను తీయడం ఆశ్చర్యకరమే
.