అఫిషియల్ : పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం.. నిహారిక

మెగా కుటుంబం మన టాలీవుడ్( Tollywood ) లో అతి పెద్ద కుటుంబం అనే చెప్పాలి.ఈ ఒక్క కుటుంబం నుండే 10 మంది హీరోలు టాలీవుడ్ లోకి చిరు పేరు చెప్పుకుని ఎంటర్ అయ్యారు.

 Niharika Konidela Granted Divorce Chaitanya Jonnalagadda , Chaitanya Jonnalagadd-TeluguStop.com

మరి అలాంటి కుటుంబం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తుంటారు.అయితే ఈ మధ్య కాలంలో వీరి కుటుంబం నుండి ఎక్కువుగా విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ భర్తకు కూడా విడాకులు ఇచ్చింది అని వార్తలు వైరల్ కాగా ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Nagababu ) కూతురు నిహారిక( Niharika ) సైతం విడాకులు తీసుకుంటుంది అని టాక్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎన్నో రకాల గాసిప్స్ వచ్చాయి.

ఇక తాజాగా వీరు కోర్టులో విడాకులు( Divorce ) అప్లై చేసారు అని ఫొటోలతో సహా బయటకు వచ్చింది.

నిహారిక పెళ్లి 2020 డిసెంబర్ 9న కుటుంబ సభ్యులు బంధువుల మధ్య అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.మరి రెండుళ్లు నిండిన వీరి పెళ్లి మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్ళింది.ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ తాజాగా నిహారిక ఆమె భర్త చైతన్య ఇద్దరు వీరి విడాకులను అఫిషియల్ గా ప్రకటించారు.

నిహారిక, చైతన్య ఇద్దరు కూడా విడాకులు ప్రకటిస్తూనే ”విడాకుల తర్వాత తాము స్టార్ట్ చేయబోయే కొత్త లైఫ్ లో ప్రైవసీ కావాలని దీనిని అందరు గౌరవించాలని కోరుకుంటున్నాం అని మాకు ఇంత కాలం అండగా నిలిచినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు థాంక్స్ ” అంటూ ఈ ఇద్దరు విడాకులపై పోస్ట్ చేయడంతో వీరి విడాకుల శకం ముగిసింది.ఇక ఎవరి లైఫ్ లో వారు ముందడుగు వేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube