రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్నా ఇలా చేస్తే పది రోజుల్లో పరార్ అవుతుంది!

రక్తహీనత( Anemia ). కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న కామన్ సమస్యల్లో ఇది ఒకటి.

 Best Way To Get Rid Of Anemia Quickly! ,anemia, Pomegranate Beetroot Juice, Late-TeluguStop.com

తినే ఆహారంలో సరిపడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ లేకుంటే రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది.

అలాగే మ నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవడం, ప్రెగ్నెన్సీ కారణాల వల్ల ఎంతో మంది మహిళలు రక్తహీనత బారిన పడుతున్నారు.కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కూడా రక్తహీనత తలెత్తుతుంది.

ఏదేమైనప్పటికీ రక్తహీనత వల్ల మనిషి చాలా నీరసంగా బలహీనంగా మారిపోతాడు.ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.

Telugu Anemia, Tips, Latest-Telugu Health

అందుకే వీలైనంత త్వరగా రక్తహీనతను వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తాగితే రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్న సరే పది రోజుల్లో పరార్ అవుతుంది.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక దానిమ్మ పండు( Pomegranate )ను తీసుకుని తొక్క తొలగించి గింజలను సపరేట్ చేసుకోవాలి.

అలాగే ఒక చిన్న బీట్ రూట్ ను కూడా తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ లో దానిమ్మ గింజలు, కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్( Beetroot ) ముక్కలతో పాటు నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.

దానిమ్మ, బీట్ రూట్ మరియు ఖర్జూరం లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ మెండుగా నిండి ఉంటాయి.

Telugu Anemia, Tips, Latest-Telugu Health

అందువలన ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే రక్త వృద్ధి అద్భుతంగా జరుగుతుంది.రక్తహీనత ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం కొద్ది రోజుల్లోనే దూరం అవుతుంది.రక్తహీనత వల్ల వచ్చిన బలహీనత దెబ్బకు ఎగిరిపోతుంది.

కాబట్టి ఎవరైతే రక్తహీనత సమస్యతో సతమతం అవుతున్నారో తప్పకుండా వారు ఈ దానిమ్మ బీట్ రూట్ జ్యూస్( Pomegranate Beetroot Juice ) ను డైట్ లో చేర్చుకోండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube