నేటి కాలంలో ఎందరినో పట్టి పీడిస్తున్న సమస్య రక్త హీనత.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, మద్యం అలవాటు, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల రక్త హీనత బారిన పడుతున్నారు.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని అవయవాలు దెబ్బ తినడమే కాదు ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.అందుకే రక్త హీనతకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే రక్త హీనతకు చెక్ పెట్టేందుకు చాలా మంది మందులు వాడతారు.
అయితే న్యాచురల్‌గా కూడా రక్త హీనత సమస్యను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా రక్త హీనతను తగ్గించడంలో గులాబీలు అద్భుతంగా సహాయపడతాయి.సాధారణంగా గులాబీలను చర్మ సౌందర్యానికి విరి విరిగా ఉపయోగిస్తుంటారు.
అయితే ఆరోగ్యానికి కూడా గులాబీలు ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధ పడే వారికి గులాబీ రేకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
మరి గులాబీలను తీసుకుంటే రక్త హీనత దూరం అవుతుంది అన్నది ప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.ఆ తర్వాత అందులో కొన్ని గులాబీ రేకులు మరియు సోంపు గింజల పొడిని వేసి బాగా మరిగించాలి.అనంతరం ఈ వాటర్‌ను వడబోసి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే రక్త హీనత సమస్య తగ్గు ముఖం పడుతుంది.
అలాగే ఒక గ్లాస్ వాటర్‌లో కొన్ని గులాబీ రేకలు, ఎండు ద్రాక్షలు మరియు యాలకుల పొడి వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత వడబోసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి.ఈ డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకున్నా రక్త హీనత సమస్య పరార్ అవుతుంది.
అంతేకాదు అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
.