నవరాత్రులలో భాగంగా నేడు 5 వరోజు ప్రారంభమైంది.5వ రోజులో భాగంగా నేడు అమ్మవారు రెండు అలంకరణలో దర్శనమిస్తారు.ఉదయం అన్నపూర్ణదేవి సాయంత్రం మహాలక్ష్మి దేవిగా అమ్మవారు నేడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.నవరాత్రులలో 5వ రోజులో భాగంగా మరి అమ్మవారిని రెండు అలంకరణలలో పూజించాలి, ఏ రంగు వస్త్రాలను సమర్పించాలి, ఏలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రులలో భాగంగా నేడు అమ్మవారు ఉదయం అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.సమస్త లోకంలో ఉన్న జీవరాశికి అన్నం పెట్టే మాతగా అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈరోజు అలంకరణలో భాగంగా అమ్మవారికి గోధుమ వర్ణపు వస్త్రాలను సమర్పించి ఎరుపు లేదా తెలుపు పుష్పాలతో పూజ చేయాలి.అనంతరం అమ్మవారికి పెరుగన్నం, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి.అమ్మవారికి పూజ చేయడానికి నేడు ఉదయం 6.22 నుంచి 7.29 వరకు తిరిగి సాయంత్రం 9.44 నుంచి 11.14 వరుకు ఎంతో అనువైన సమయం.

అదేవిధంగా నవరాత్రులలో భాగంగా నేడు అమ్మవారు సాయంత్రం మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.నేడు అమ్మవారి అలంకరణలో భాగంగా అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాలను సమర్పించాలి.
అదేవిధంగా అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తరంలోని 108 నామాలు పఠించాలి.నేడు సాయంత్రం అమ్మవారికి పూజ చేయటానికి 4.53 నుంచి 7.38 వరకు ఎంతో అనువైన సమయం.