సైకిల్ తొక్కుతూ వీడియో గేమ్‌ ఆడేయొచ్చు తెలుసా?

నేటితరం వీడియో గేమ్స్ పట్ల ఏవిధంగా ఆకర్శితులైనారో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలో వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వీడియో గేమ్స్ తయారుచేసే కంపెనీలు నిరంతరం అప్ గ్రేడ్ అవుతూ వారిని మరింత ఆకర్షిస్తున్నాయి.

 Did You Know You Can Play Video Games While Riding A Bicycle, Cycling, Viral Lat-TeluguStop.com

ఈ క్రమంలోనే వ్యాయామం చేస్తూ వీడియో గేమ్స్ అదే విధంగా ఏర్పాటు చేసారు సదరు వ్యవస్థాపకులు.అవును, నిత్యం సైక్లింగ్‌ చేయాలంటే కొందరు అనాసక్తి ప్రదర్శిస్తుంటారు.

అందుకే వ్యాయామానికి డుమ్మా కొడుతుంటారు! అందుకని గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి జోష్‌ ఇలియాస్‌ జాయ్‌ అలాంటి ఓ వినూత్న ఆలోచన చేశాడు.

వ్యాయామ బైక్‌పై సైక్లింగ్‌ చేస్తూ వీడియోగేమ్‌ ఆడుతూ.

ఎంతో ఆసక్తితో కసరత్తులు చేయవచ్చని తాజాగా నిరూపించాడు.జోష్‌కు చిన్నప్పట్నుంచి వీడియోగేమ్‌లు ఆడటం ఎంతో ఇష్టం.ఇందుకుగాను అతను పాత వ్యాయామ బైక్‌ను వైర్‌లెస్‌ గేమ్‌ ప్యాడ్‌గా మార్చివేసాడు.ESC32 మైక్రో కంట్రోలర్‌ సాయంతో బైక్‌ను అనుసంధానం చేశాడు.సైక్లింగ్‌లో పెడల్‌ తొక్కుతుంటే వీడియో గేమ్‌లో కారు స్పీడ్‌ పెరిగేలా అనుసంధానించాడు.బైక్‌ హ్యాండిల్‌కు ఉన్న టచ్‌ ప్యాడ్స్‌ను కుడి, ఎడమ వైపునకు నడిపేలా ప్రత్యేక సెన్సర్లు ఏర్పాటు చేశాడు.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఇక దాంతో టచ్‌ ప్యాడ్స్‌ పల్స్‌ రేటు చూసేందుకు ఉపయోగపడ్డాయి.దీనికి ఇబ్బంది లేకుండా వీడియోగేమ్‌లో కారు దిశలను మార్చేలా రూపొందించాడు.జాయ్‌స్టిక్‌, ఇతర బటన్స్‌ యాడ్‌ చేశారు.ఇందుకు కేవలం రూ.1500 ఎలక్ట్రానిక్‌ పరికరాలు మాత్రమే వాడటం జరిగిందని చెప్పుకొచ్చాడు.ఎక్స్‌ర్‌బైక్‌కు ప్రత్యేకంగా స్క్రీన్‌ అమర్చడంతో పవర్‌ పాయింట్‌తో గోడపై స్క్రీన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేయడంతో సైక్లింగ్‌ వీడియో గేమ్‌ తయారైపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube