కొత్త హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలివే ...!

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ – 19 హోమ్ ఐసోలేషన్ నియమనిబంధనలను సవరణ చేసింది.తక్కువ లక్షణాలు ఉన్న ఎలాంటి లక్షణాలు లేని వారిని రోగులను ఐసోలేషన్ జాబితాలో ఉంచాలని తేల్చింది.

 Home Isolation Rules, Home Isolation,corona Patients, Corona Effect-TeluguStop.com

ఈ కొత్త సడలింపులు మార్గదర్శకాల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్, క్యాన్సర్ థెరపీ, హెచ్ఐవి రోగులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక వారు ఈ జాబితా నుండి విముక్తులు.ఇక అలాగే 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, వీటితో పాటు ఎవరికైనా మధుమేహం, బిపి, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి మొదలగు సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకొని మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో ఉండటానికి అనుమతి ఇచ్చారు.

తాజా రోజుల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఎటువంటి రోగ లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్యశాఖ హోమ్ ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గాలను జారీ చేయాల్సి వచ్చింది.ఇకపోతే ఇంటి నిర్బంధంలో ఉన్న కరోనా రోగులకు లక్షణాలు మొదలైన 10 రోజులు తర్వాత, వరుసగా మూడు రోజులు ఎలాంటి జ్వరం రాకుండా ఉండే వారిని డిశ్చార్జ్ చేసినట్లు భావించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది.

హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులు ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

అంతే కాదు వారు వారి హోం ఐసోలేషన్ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్షలు తప్పనిసరిగా అవసరం లేదని పేర్కొంది.

ఇకపోతే ఎవరైతే కరోనా రోగులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులతో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి సదుపాయాలు ఇంట్లో లేనివారికి తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.వీటితో పాటు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకుని నిరంతరం దానిని యాక్టివ్ గా ఉండాలన్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులు ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయన్న దృష్టి మీరు గమనించినట్లయితే వెంటనే వారు వైద్య సహాయం పొందాలని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube