తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.అలాగే అక్కడ స్టార్స్ మన సినిమాల్లో నటించడానికి కానీ.
వారి సినిమాలను ఇక్కడ ప్రోమోట్ చేయడానికి కానీ అంత ఆసక్తి చూపించేవారు కాదు.కానీ ఇప్పుడు అలా కాదు.
మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.
బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.
పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతుంది.బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
దీంతో బాలీవుడ్ స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు.
బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని టాలీవుడ్ మార్కెట్ పై అక్కడి స్టార్స్ ఫోకస్ పెట్టి స్వయంగా హైదరాబాద్ తరలి వచ్చి మరీ ప్రొమోషన్స్ చేసుకుంటున్నారు.మన తెలుగుపై కాస్త అతి ప్రేమ చూపిస్తూ వారి మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటున్నారు.
ఇక ఇప్పుడు తన సినిమా కోసం ప్రోమోట్ చేసుకుంటున్న స్టార్స్ లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముందు ఉన్నారు.

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.
ఆగష్టు 11న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి మరీ సినిమాను బాలీవుడ్ లో కంటే తెలుగులో ఎక్కువ ప్రోమోట్ చేస్తున్నాడు.అంతేకాదు ఆయన స్నేహితులు నాగార్జున, చిరంజీవి ను కూడా రంగంలోకి దింపి మరీ ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నాడు.
దీంతో బాలీవుడ్ కంటే అమీర్ ఖాన్ మన తెలుగు పైనే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఇక్కడే కనిపిస్తున్నాడు.దీంతో ఈ ప్రేమలన్నీ అప్పుడు ఏమయ్యాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత ప్రేమ చూపించిన ఏది చేసిన కంటెంట్ బాగుంటేనే సినిమా హిట్ చేస్తాం అని ప్రేక్షకులు పట్టుదలతో ఉన్నారు.చూడాలి ఈ సినిమాతో అయినా బాలీవుడ్ కు మంచి హిట్ దక్కుతుందో లేదో.







