తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కొనసాగుతున్న ఈ ఆశావహుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.
గాంధీభవన్ లో ఇప్పటివరకు 723 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఇల్లందు నియోజకవర్గం సీటు కోసం 36 మంది ఆశావహులు అప్లయ్ చేసుకున్నారు.మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేతలు అయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల, షబ్బీర్ అలీ వంటి తదితరులు దరఖాస్తు సబ్మిట్ చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు ఇవాళ దరఖాస్తులు సమర్పించనున్నారు.







