కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరకి పెద్ద రాజకీయ కష్టమే వచ్చి పడింది.మొదట్లో ఆమెకు బిజెపిలో ఎక్కడలేని ప్రాధాన్యం దక్కింది.
కేంద్రంలో ఆమెకు కీలకమైన నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ పదవులు అప్పగించి ప్రోత్సహించిన బిజెపి అధిష్టానం పెద్దలు ఇప్పుడు మాత్రం ఆమె ప్రాధాన్యాన్ని బాగా తగ్గించేశారు.ఆమెకు పార్టీ పరంగా కేటాయించిన పదవుల్లోనూ కోతలు విధించడం ద్వారా ఆమె ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు.
ఏపీలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన పురందరేశ్వరి కి రాజకీయ పలుకుబడి ఉండడంతో పాటు, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ కుమార్తె గా ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ తమకు కలిసి వస్తాయని అంచనాలతో బిజెపి ఆ స్థాయిలో పురందరేశ్వరికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.

ఏపీలో పార్టీలో చేరికల ను ప్రోత్సహించే బాధ్యతను పురందరేసరికి అప్పగించినా, ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం పెద్దగా బిజెపిలో చేరికలు లేకపోవడం వంటి కారణాలతో ఆమెకు ఇతర రాష్ట్రాలలో బిజెపి తరఫున నియమించిన ఇన్చార్జి పదవుల్లో కోత విధించారు.అయితే ఇదంతా ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన తరువాత చోటు చేసుకోవడంతో ఆమెకు బిజెపిలో ప్రాధాన్యం తగ్గడానికి కారణం ఎన్టీఆర్ అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.అంతేకాదు అమిత్ షా తో బేటి సందర్భంగా ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి రాలేనని ఎన్టీఆర్ చెప్పడం , బిజెపి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అంత ఆసక్తి చూపించకపోవడం ఇవన్నీ లెక్కల్లోకి తీసుకున్న బిజెపి పెద్దలు… సొంత మేనల్లుడిని కూడా పార్టీ వైపు తీసుకురాలేకపోవడం, ఏపీలో చేరికలను ఏమాత్రం ప్రోత్సహించలేకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుని ఆమె కు ఉన్న పదవుల్లో కోత విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది.







