తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కువైట్‌లో బీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.NRI BRS కువైట్ ప్రెసిడెంట్, జాగృతి కువైట్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వలస కార్మికులకు నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.దీనికి సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త బీఆర్ఎస్ వర్గాల్లో వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో విశిష్ట పథకాలు ప్రవేశపెట్టారని ఆ నిర్వాహకులు కొనియాడారు.తెలంగాణ పథకాలను అనేక రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు.భారతదేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.కేసీఆర్ భారత ప్రధానమంత్రిగా మారి దేశాన్ని తెలంగాణలాగా అభివృద్ధి చేయాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వారు తమ మనసులోని మాటను బయటపెట్టారు.
ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలతో పాటు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇతర BRS నాయకులు కూడా పాల్గొన్నారు.ఇకపోతే కేసీఆర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లాలో కూడా శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.“తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.