సమాచార హక్కు చట్టంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కమిషనర్ల నియామకంలో జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకం పరిశీలనలో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.మరోవైపు సీఎస్ శాంతికుమారి సమర్పించిన అఫిడవిట్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సమాచార కమిషనర్ల నియామకానికి తీసుకున్న చర్యలపై క్లారిటీ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఆగస్ట్ 23వ తేదీకి వాయిదా వేసింది.







