పత్రిక స్వేచ్ఛ పై కేంద్రం ప్రభుత్వ దాడిని ఖండించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: (భారత విద్యార్థి ఫెడరేషన్) ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సంద్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని ఖండించాలని ఆయన అన్నారు.

 Condemn Central Governments Attack On Press Freedom, Central Government, Press F-TeluguStop.com

న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులకు పాల్పడిన తీరు చాలా దురదృష్టకరమని అన్నారు.అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ బావ ప్రకటన స్వసంత్రం పై జరుగుతున్న దాడిని ఎస్ఎఫ్ఐ సిరిసిల్ల జిల్లా కమిటీ ఖండిస్తుందన్నారు.

అంతేకాకుండా కఠినమైన ఉప చట్టంల కింద కేసులను నమోదు చేస్తామని భయబ్రాంతులకు గురి చేయడం జరుగుతోంది బిజెపి పాలనలో ప్రజాస్వామ్య సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని లేని యెడల వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

భారత రాజ్యాంగాన్ని మార్చే విధంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ (బీజేపీ ) తగిన గుణపాఠం చెప్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, జిల్లా నాయకులు సొల్లు సాయి, పెండల ఆదిత్య, అడేపు అభిషేక్, సెల్ల నవీన్ , అరుణ్, రామ్ చరణ్, సాయి చరణ్, బాను, భాస్కర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube