సాగు నీటి విడుదల పై రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేత.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలోని ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పపూర్,నారాయణపూర్, కోరుట్లపేట,సర్వాయి పల్లె ఐదు గ్రామాలలో గల 1600ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం చేయడం కోసం స్థానిక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామల కు సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) వినతి పత్రం అందజేశారు.ఇప్పటి వరకు సింగ సముద్రం కు పడిన గండ్లు పూడ్చి వేసి నీటి విడుదలకు రంగం సిద్దం చేసినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.

 Submission Of Petition To Revenue Authorities On Release Of Cultivation Water.-TeluguStop.com

నీటి విడుదల పై ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు తెలియజేయడం జరిగిందని బాలరాజు యాదవ్ తెలిపారు.ఇట్టి కార్యక్రమం లో సింగ సముద్రం నీటి సంఘం మాజీ చైర్మన్ నేవురి బాలయ్య గారి గోపాల్ రెడ్డి,గుడి విఠల్ రెడ్డి,జీడి రాజు యాదవ్, పయ్యావుల రాజు యాదవ్ బాయికాడి రాజయ్య,మ్యాకల శరవింద్, ఎనగందుల సత్యనారాయణ, గన్న బాల్ రెడ్డి,ఆరే నర్సింహులు, ఎనగందుల పోచయ్య, రేసు శంకరయ్య, ,బాధ ఎల్లం,బాధ ఎల్లం తో పాటు సింగ సముద్రం ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube