రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ కార్యక్రమం తెలంగాణ ఖ్యాతిని, అభివృద్ధిని చాటి చెప్పేలా జిల్లా కేంద్రంలో ఉత్సాహభరితంగా సాగింది.సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం నేతన్న చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti ), ఎస్పీ అఖిల్ మహాజన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య నేతన్న చౌరస్తా వద్ద జెండాను ఊపి రన్ ను ప్రారంభించారు.జిల్లా కేంద్రంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువతీ, యువకులు, పోలీస్ సిబ్బంది, 17 వ బెటాలియన్ సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తెలుపు రంగు టీ షర్టులను ధరించి, పెద్ద ఎత్తులో తెలంగాణ రన్ లో భాగస్వామ్యం కావడం తెలంగాణ దశాబ్ద కాలం ప్రగతికి అద్దం పట్టింది.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో సాధించిన ప్రగతిని దేశ నలుమూలలా తెలియజేసేలా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీకారం చుట్టారని తెలిపారు.ప్రతీ ఒక్కరి ఆరోగ్య రక్షణకు వ్యాయామం చేయడం ముఖ్యమని, యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం, యోగ ప్రతి నిత్యం చేయాలన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణ రన్ లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ ను నిర్వహించుకున్నామని, వ్యాయామం, క్రీడల ద్వారా మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు.
అందరికీ ఫిట్ నెస్ చాలా ముఖ్యమని, తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీస్ శాఖకు, భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 22 వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు.
దశాబ్ది వేడుకల స్ఫూర్తితో మరో దశాబ్ద కాలానికి ప్రణాళిక వేసుకోవచ్చని తెలిపారు.వ్యాయామం చేయడం ద్వారా ప్రతీ ఒక్కరికీ మానసిక, శారీరక ఫిట్ నెస్ కలుగుతుందని అన్నారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలందరికీ క్షేత్ర స్థాయిలో తెలియజేయాలని అన్నారు.ఈరోజు నిర్వహించిన తెలంగాణ రన్ లో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర ఉద్యమ సమయంలో నిర్వహించిన రన్ ఫర్ తెలంగాణ అనే కార్యక్రమం గుర్తుకు వచ్చిందని తెలిపారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య మాట్లాడుతూ జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో తెలిపేలా, దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.ప్రతీ మనిషికి శారీరక శ్రమ తప్పనిసరి అని, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే అని అన్నారు.
ఇనుప కండలు ఉన్న వారు వంద మంది ఉంటే దేశం యొక్క రూపు రేఖలు మార్చవచ్చని స్వామీ వివేకానంద ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అనంతరం రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలనే కాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.
ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన అన్నారు.అనంతరం రన్ లో పాల్గొన్న వారందరికీ మెడల్స్ అందజేశారు.ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్లకార్డులు తెలంగాణ రన్( Telangana 2K run ) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మహిళల రక్షణకు, మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ, వినూత్నంగా రూపొందించిన ప్లకార్డులు తెలంగాణ రన్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, 17 వ బెటాలియన్ ఇంఛార్జి కమాండెంట్ జయరాజు, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఉపేందర్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారథి రెడ్డి, సిఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేష్, రజినికాంత్,ఎస్.
ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








