యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు దేవర ( Devara ) అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.
ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఎన్టీఆర్ 30 వ సినిమా గా దేవర సినిమా రూపొందుతోంది.
ఇక 31వ సినిమా గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prasanth Neel ) దర్శకత్వం లో సినిమా రాబోతుంది.ఇప్పటికే ఎన్టీఆర్ యొక్క 32వ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది.
ఆ సినిమా బాలీవుడ్ లో రాబోతుంది.వార్ 2 ను( War 2 ) ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ యొక్క సినిమాల జాబితా అంతకంతకు పెరుగుతూనే ఉంది.ఒకే సారి నాలుగు అయిదు సినిమా లను లైన్ లో పెట్టే విధంగా ఎన్టీఆర్ సినిమా లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 32వ సినిమా వార్ 2 కాగా ఎన్టీఆర్ యొక్క 33 వ సినిమా ను సుకుమార్ దర్శకత్వంలో( Sukumar ) చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ యొక్క రేంజ్ అమాంతం పెరిగి పోయింది.కనుక ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా లు.పాన్ వరల్డ్ సినిమా లు చేసేందుకు కమిట్ అవుతున్నాడు.

ముందు ముందు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎన్టీఆర్ చేసే అవకాశాలు ఉన్నాయి.తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ 50 సినిమా ల ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.దేవర సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ యొక్క సినిమా ల స్పీడ్ అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా వార్ 2 సినిమా కనుక హిందీ లో హిట్ అయ్యి అక్కడ మంచి పేరు ఎన్టీఆర్ కి వస్తే ఇక అక్కడ కూడా ఆగక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







