ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడిని నియంత్రించాలి

బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ కు వినతి పత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఎల్లారెడ్డిపేట మండల పక్షాన మండలంలో ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీసులో మేడం కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట( Gollapally, Ellareddypet ) ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేటర్ స్కూళ్లు అధిక ఫీజుల వసూలు చేస్తూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూన్నాయని,పుస్తకాలు కు అధిక ధరలు వసూలు చేస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

 Exploitation Of High Fees By Private And Corporate Schools Should Be Curbed , Co-TeluguStop.com

ఏ స్కూల్ లో కూడా పేరెంట్స్ కమిటీ వేయకుండా యాజమాన్యాలు అధిక పేజీలు వసూలు చేస్తా ఉన్నారని,ఏ స్కూల్లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధన పాటించడం లేదన్నారు.ఇప్పటికైనా ప్రతి స్కూల్ ప్రత్యేకంగా శ్రీ చైతన్య పాఠశాల తో పాటు మిగతా పాఠశాల పై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

లేదంటే రానున్న రోజుల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా యువమోర్చా ఎల్లారెడ్డిపేట పక్షాన ఎంఈఓ,డిఈఓ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలకిషన్, కోశాధికారి శ్రీకాంత్, నాయకులు సనత్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube