ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధ్యానత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వినతులు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు లతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

 High Priority Should Be Given To Prajavani Applications District Collector Anura-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 15 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని అందులో రెవెన్యూ – 3
డీటీసీపీ ఒ , సిరిసిల్ల – 1
ఎంసీ సిరిసిల్ల – 5
ఎంసీ వేములవాడ – 1
డి ఎం హెచ్ ఓ – 1
ఎంప్లాయిమెంట్ – 1
ఎస్ పి – 1
ఏసీ ఎల్ బి సార్ – 1
ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ – 1 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube