బండ్ల బోనాల పండగ కోసం ఏర్పాట్లు పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి ఏటా ఆనవాయితీగా ఎల్లారెడ్డిపేటలో వస్తున్న బండ్ల బోనాల పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా బండ్ల బోనాల పండుగ కోసం ఏర్పాట్ల కోసం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు.

 Arrangements Are Complete For Bandla Bonala Festival, Bandla Bonala Festival, R-TeluguStop.com

బండ్ల బోనాల పండుగ ను ఆదివారం సాయంత్రం ప్రారంభించనున్నట్లు సమావేశములో పాల్గొన్న వారు తెలిపారు.మొదటగా రావి చెట్టు హన్మాండ్ల గుడి ఎదురు వీది నుండి సార్గమ్మ, పోచమ్మ వీది గుండా ప్రారంభమై చివరకు ఎల్లమ్మ గుడి వద్ద ముగుస్తాయి.

ఇట్టి కార్యక్రమం లో బోనాలు ఎత్తుకునీ అమ్మ వార్లకు నైవేద్యములు సమర్పించే వారికి టవల్ లను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తన స్వంత డబ్బులతో అమ్మ వార్ల టవల్ లను అందజేశారు.

ఇట్టి కార్యక్రమం లో ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు పారి పెళ్లి రాంరెడ్డి, మేగీ నర్సయ్య, బుచ్చి లింగు సంతోష్ గౌడ్,అల్లం శ్రీకాంత్,శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సద్ది మద్ధుల సంఘం అధ్యక్షుడు మద్దుల పద్మా రెడ్డి,ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు కోరుట్ల పేట లక్ష్మారెడ్డి, భారత్ సిమెంట్ డీలర్ నేవూరి సత్యం రెడ్డి, కాసార్ల స్వామి, కొడిమోజు దేవేందర్,చందనం బ్రహ్మ చారి, చెన్ని ఎల్లయ్య, దేవయ్య, దేశపండి ఆంజనేయులు, దేశపండి మల్లేశం, కుమ్మరి లచ్చయ్య, కుమ్మరి చంద్రం చందనం నాగ భూషణం , చందనం రాములు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, గడ్డం ఆనందం, గడ్డం వెంకటేష్,చందనం రాము జల్లి చంద్రయ్య,కొన్నే పోచయ్య, మద్దుల రవి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube