లీకులకు కారణము ఎవరు ప్రభుత్వం నిగ్గు తేల్చాలి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో లీకేజీల పర్వం కొనసాగుతుందని దీనికి కారకులు ఎవరని మొన్న టిఎస్పిఎస్సి నిన్న పదవ తరగతి పేపర్ లీక్( Tenth Class Paper Leak ) లను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి( Congress Party Leader KK Mahendar Reddy ) సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సమర్థవంతంగా నిర్వహించామని చెప్పి.

 Congress Leader Kk Mahendar Reddy On Exam Papers Leakage Issue,kk Mahendar Reddy-TeluguStop.com

అసమర్థ పనులకు పూనుకుంటుందన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో లీకేజీల పర్వం కొనసాగుతోందని,నిరుద్యోగ స్టూడెంట్లు అత్మహత్యలు చేసుకుంటే వారిని పట్టించుకున్న పాపాన పోతలేరని మండిపడ్డారు.
30 లక్షల కుటుంబాలు గోస త కల్వకుంట్ల కుతుంబానికి తప్పక తగులుతదని,గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పేపర్స్ అమ్ముకున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడం దురదృష్టకరంమని అన్నారు.అలాగే ఆరోపణలు వస్తే దాడులు కాదు నీ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
మీరు నిజాయితీపరులైతే సీబీఐ ఎంక్వైరీ( CBI Enquiry )కి ఒప్పుకోవాలని అన్ని రోజులు మీవి కావని ప్రజలు గమనిస్తున్నారన్నారు.టెన్త్ పేపర్ కూడా లీక్ అవ్వడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

అలాగే పేపర్ అమ్ముకొని కూడా కొందరు పరిపాలన సాగిస్తున్నారని తెలంగాణ ప్రజల ఆశలను బ్రతికిచ్చి.ప్రజలకు బరోసా నిచ్చే బాధ్యత మాపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.

మీ నిజాయితీ నిరూపించుకోవాలి లేదంటే ప్రజల ముందు దోషులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.గ్రూప్ వన్ కట్ ఆప్ మార్కులు ప్రకటించక ముందే మంత్రి కెటిఆర్ చెప్పడం ఏంటి?దీన్ని బట్టే అర్థమవుతుంది టిఎస్పీఎస్సీ ఎవరి చేతుల్లో ఉన్నదనేది అని నిరుద్యగులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉండి వారికి న్యాయం జరిగేలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజ్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube