అలోవెరాతో షాంపూ.. ఎన్ని స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుందో తెలుసా?

అలోవెరా లేదా కలబంద. దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

 Do You Know How Many Problems Can Be Removed With Aloe Vera Shampoo Details? Alo-TeluguStop.com

దాదాపు అందరి ఇంటి పెరటిలోనూ ఉండే క‌ల‌బంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా మరియు సౌందర్య పరంగా అలోవెరా అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.

అలాగే కురుల సంరక్షణకు సైతం అలోవెరా ఎంత‌గానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా అలోవెరాతో ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూను తయారు చేసుకుని వాడితే ఎన్నో జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం అలోవెరాతో షాంపూను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందు రెండు కలబంద ఆకులను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన కలబంద ఆకుల నుంచి జెల్ ను సపరేట్ చేయాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కలబంద జెల్, రెండు రెబ్బల కరివేపాకు, రెండు మందారం పూలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో నాలుగు టేబుల్ స్పూన్లు బేబీ షాంపూను వేసి బాగా మిక్స్ చేస్తే అలోవెరా షాంపూ సిద్ధం అయినట్టే.ఈ షాంపూను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.ఈ షాంపూను హెయిర్ వాష్ కు వాడితే కనుక జుట్టు రాలడం క్ర‌మంగా త‌గ్గుతుంది.

చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.కురులు పట్టులా మెరిసి పోతాయి.

మరియు వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా సైతం ఉంటుంది.కాబ‌ట్టి, అలోవెర అందుబాటులో ఉంటే త‌ప్ప‌కుండా పైన చెప్పిన విధంగా షాంపూను త‌యారు చేసుకుని ఉప‌యోగించేందుకు ప్ర‌య‌త్నించండి.

పైగా ఈ అలోవెరా షాంపూ వ‌ల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube