SP Akhil Mahajan : ప్రతి విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే నిరంతరం కష్టపడాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే అది విద్య వల్లనే సాధ్యం అని, దానికోసం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, ప్రణాళికతో కష్టపడి చదవాలని,పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్, యోగ వంటివి అలవర్చుకోవలని విద్యార్థులక జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు.ముస్తాబాద్ మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై ముస్తాబాద్ పోలీస్( Mustabad Police ) వారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ).

 Sp Akhil Mahajan Motivational Speech For Mustabad School Students-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.విద్యార్థిని, విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరుకోవడానికి హార్డ్ వర్క్ యే ప్రధాన అస్త్రం అని,కష్టపడే తత్వమే విజయాల దరికి చేరుస్తుందన్నారు.
ఎ పరిస్థితుల్లోనైనా తము ఎంచుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలను మధ్యలో నిలిపివేయకుండ ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో,ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.ప్రతి విద్యార్థి ఒక సారి చేసిన తప్పును మళ్లీ చేయకుండ ఆ తప్పులు నుండి నేర్చుకొని విజయాలు సాధించాలని, విద్యార్థులు( Students ) ఎప్పుడు తమకు తామే పోటీ అనుకోవాలే తప్ప ఇతరులతో తమను తాము దేనిలోనూ పోల్చుకోవద్దని సూచించారు.

పరీక్షలలో మార్కులు తక్కువ, మధ్యస్థంగా వచ్చిన ఎవరు బాధపడనవసరం లేదని, గొప్ప గొప్ప స్థాయికి వచ్చినా వారంతా అవ్యరేజ్ స్టూడెంట్స్ అన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు.ప్రతి విద్యార్థి ఒత్తిడి ని<( Stress )/em> అధిగమించడానికి యోగ, మెడిటేషన్, బుక్స్ చదవడం లాంటివి అలవర్చుకోవలన్నారు.

ప్రస్తుతం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.అనంతరం ఎస్పీ మండల పరిధిలో గల పదవ తరగతివిద్యార్థులకు ఎగ్జామ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు.

ఎస్పీ వెంట డిఎస్పీ భీంశర్మ, సి.ఐ సదన్ కుమార్, ఎస్.ఐ శేఖర్ రెడ్డి,సైకజిస్ట్ లు స్వామి, శ్రీనివాస్,ప్రవీణ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube