పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువద్దాము.- మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట ( Kishan Das Peta )లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం కేంద్ర, రాష్ట్ర సహకారాలతో పాటు పూర్వ విద్యార్థుల సహకారం కూడా తీసుకుందామని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.ఇటీవల ఇట్టి పాఠశాలలో పనిచేసి బదిలీ పై వెళ్ళగా నూతనంగా పాఠశాలకు వచ్చిన ఉపాద్యాయ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.

 Let's Bring The Former Glory To The School Ex-mptc Oggu Balaraj Yadav, Kishan Da-TeluguStop.com

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇట్టి పాఠశాలను ఎదిగే విధంగా కృషి చేయాలని అన్నారు.గతంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల శిధిలావస్థలో ఉందని అట్టి పాఠశాలను తొలగించి మోడల్ కాంప్లెక్స్ పాఠశాల నిర్మించడానికి కృషి చేయాలని కోరారు.

పిల్లలకు సంబంధించిన చిత్ర పటాల ను వేయడానికి నూతనంగా విధుల్లో చేరిన రజిత, ప్రశాంత్ లు కృషి చేయడం అభినందనీయం అని బాలరాజు యాదవ్ అన్నారు.పాఠశాలకు మైక్ సెట్ అవసరమని,జావ తాగడానికి గ్లాస్ లు అవసరమని ఉపాద్యాయులు బాలరాజు యాదవ్ తో చెప్పారు.

పూర్వ విద్యార్థుల సహకారం కూడా తీసుకుందామని నిర్ణయించడం జరిగింది.ఈ మేరకు పాఠశాలలో చదువుకుని స్థిరపడిన విద్యార్థుల వివరాలు సేకరించడం జరిగింది.

పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీ తో పాటు పూర్వ విద్యార్థుల కమిటీ సైతం వేయాలని అతి త్వరలో పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది.ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు రజిత, ప్రశాంత్,అంజలి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube