ఆ సమయంలో ప్రశాంత్ నీల్ ను హత్య చేయాలనిపించేది.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్!

గత ఏడాది డిసెంబర్లో విడుదల సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం సలార్.( Salaar ) కన్సార్ ప్రపంచంలో ప్రశాంతని సృష్టించిన సరికొత్త ప్రపంచ సినిమాలోని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు పండగ చేసుకున్నారు.

 Salaar Actress Sriya Reddy Reveals The Bad Habit Of Prashanth Neel Details, Sriy-TeluguStop.com

ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడికి ఒక సంతృప్తిని మిగిల్చింది ఈ సినిమా.అయితే చాలా రోజుల తరువాత సలార్ సినిమాతో వెండి ధరపై దర్శనం ఇచ్చింది శ్రియారెడ్డి.( Sriya Reddy )

Telugu Actresssriya, Bad Habit, Prabhas, Prashanth Neel, Sriya Reddy, Sriyareddy

రాధారమ మన్నార్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించి హీరోలకి గట్టి పోటీని ఇచ్చింది.ఈ సినిమాలో ఆమె నటనతో పాటు లుక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమా తర్వాత ఆమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ నటి.ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సలార్ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడింది.సినిమా ఒప్పుకునేటప్పుడే నేను మీ సినిమాలో నటించాలంటే హీరోతో సమానంగా నా పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి, కథానాయకుడిలా పవర్ ఫుల్ గా ఉండే రోల్ నాకు ఉండాలి అని చెప్పిందట.అలాగే ప్రతిరోజు ఈ విషయంలో డైరెక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చేదంట శ్రియ రెడ్డి.

Telugu Actresssriya, Bad Habit, Prabhas, Prashanth Neel, Sriya Reddy, Sriyareddy

ప్రతిరోజు తను ఏం మాట్లాడాలో ముందే గానే ప్రిపేర్ అయి వచ్చేదంట అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ( Prashanth Neel ) సెట్ లో డైలాగులు రాసుకునే అలవాటు ఉండటంతో అతని మీద విపరీతమైన కోపం వచ్చేది, చంపేయాలి అన్నంత కోపం వచ్చేసేది అంటూ ఆనాటి సంఘటనలు తలుచుకొని సరదాగా చెప్పింది శ్రియా రెడ్డి. ఇప్పుడు ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన శ్రియా రెడ్డి అప్పుడప్పుడు అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇందులో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube