వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నీర్వహించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల:ఖరీఫ్ సీజన్ 2024 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నీర్వహించాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ( District Collector Sandeep Kumar Jha) అన్నారు.బుదవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ 2024 వరి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

 District Collector Sandeep Kumar Jha Said That Purchase Of Paddy Should Be Stric-TeluguStop.com

జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనా తో, పి ఏ సి ఎస్ ద్వారా 194, ఐకెపి ద్వారా 44, డిసిఎంఎస్ ద్వారా 8, మెప్మా ద్వారా 4 మొత్తం 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు , అధికారులు వివరించారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సన్న రకం, రైతుల సంఖ్య, పంట దిగుబడి, వాటిని ఏ రైస్ మిల్లులకు పంపుతారు మొదలగు వివరాలను కొనుగోలు కేంద్రాల వారిగా కలెక్టర్ తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం సన్న రకాల ధాన్యాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి వ్యవసాయ విస్తరణ అధికారితో సమన్వయం చేసుకుంటూ గుర్తించాలని, వీటిని కోనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకంగా కేటాయించిన రైస్ మిల్లు( Rice mill )లకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు వీలుగా అవసరమైన మేర వాహనాలు సన్నద్దం చేయాలని, సదరు వాహనాన్ని జి.పి.ఎస్ సిస్టం ను ఏర్పాటు చేయాలని వాహనం నెంబరు డ్రైవర్ క్లీనరు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, సన్న రకం దాన్యం బ్యాగుల పై ఆ నెంబర్, ప్రత్యేకమైన గుర్తింపు కొరకు స్టాంప్ వేయాలని, రైతులకు ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం టోకెన్ లు అందచేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు ,ప్యాడి క్లీనర్లు , టార్ఫాలిన్ లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందించినారని కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారి నుండి అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు దగ్గరే ధాన్యం నాణ్యతను కట్టుదిట్టంగా పరిశీలించాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండడానికి వీలులేదని ,ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కు సంబంధించిన నివేదిక సమర్పించాలని,ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టి , రోడ్డు ప్రమాదాల కు దారి తీయకుండా చూడాలన్నారు.రైతులకు టోకెన్ పద్ధతి లో మాత్రమే ధాన్యం సెంటర్ కు తీసుకొని వచ్చి, కొనుగోలు చేసే విధంగా చూడాలని అన్నారు.

ధాన్యం రవాణా కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెంటర్ కు సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ , పిడి డిఆర్డిఏ శేషాద్రి, సివిల్ సప్లై అధికారి వసంత లక్ష్మి, డిఎం సివిల్ సప్లై రజిత, డి.సి.ఓ.రామకృష్ణ, ఇన్చార్జి అగ్రికల్చర్ ఆఫీసర్ రామారావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube