సముద్ర లింగాపూర్ లో మన ఊరు మన బడి కార్యక్రమం. ర్యాలీ నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులు.

ర్యాలీ నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట మండలం సముద్రాలింగాపురం గ్రామం లో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మన ఊరు మనబడి( Mana Ooru Mana Badi ) కార్యక్రమంలో భాగంగా విద్య దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.

 Mana Uru Mana Badi Program In Samudra Lingapur. Students Organized The Rally.-TeluguStop.com

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలలో ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన ప్రతి ఒక్క విద్యార్థికి అందుతుందని అన్నారు.ఉచితంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపిటిసి పరశురాములు, ఉపసర్పంచ్ దేవేందర్, స్కూల్ చైర్మన్ నాంపల్లి, ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట చారి, బద్రుద్దీన్ ఖాన్,శంకరయ్య, బాలయ్య, నాగరాణి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube