ఆ టైటిల్ పెట్టి అలా చేసి ఉంటే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ఏమైందంటే?

ఆదిపురుష్( Adipurush ) సినిమా వివాదాలతో మొదలై రిలీజ్ తర్వాత కూడా వివాదాలతో కొనసాగుతుండటం గమనార్హం.ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆ ఆశలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Adipurush Movies Biggest Mistakes Details Here Goes Viral In Social Media , Adip-TeluguStop.com

ఆదిపురుష్ అనే టైటిల్ విషయంలోనే తప్పు జరిగిందని కొంతమంది చెబుతున్నారు.శ్రీరాముడి పేరు ఆదిపురుష్ అని ఎక్కడా ప్రస్తావించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు జై శ్రీరామ్ పర్ఫెక్ట్ టైటిల్ అని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటే ఈ సినిమాకు మేలు జరిగి ఉండేదని కొంతమంది చెబుతున్నారు.మరోవైపు ఓం రౌత్ ఆదిపురుష్ ను తన ఊహలకు అనుగుణంగా కాకుండా, ఎవరి మనోభావాలను కించపరచకుండా టెక్నాలజీని( Technology ) ఉపయోగించి ఇంతే అద్భుతంగా తెరకెక్కించి ఉంటే ఆదిపురుష్ సినిమాతో ఓం రౌత్ ఇండస్ట్రీ హిట్ సాధించేవారని చెప్పవచ్చు.

Telugu Adipurush, Mythological, Prabhas, Tollywood-Movie

అలా చేసి ఉంటే ఆదిపురుష్ మూవీ ఈ స్థాయిలో వివాదాల్లో సైతం చిక్కుకుని ఉండేది కాదు.మేకర్స్ ఈ సినిమా విషయంలో ఇంత పెద్ద పొరపాట్లు ఏ విధంగా చేశారో అర్థం కావడం లేదు.ప్రభాస్( Prabhas ) అయినా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మెరుగ్గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ సినిమాపై వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Telugu Adipurush, Mythological, Prabhas, Tollywood-Movie

ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ స్పందిస్తే ఈ సినిమాపై నెగిటివిటీ కొంతమేర తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించే వాళ్లను ఆదిపురుష్ మూవీ భయపెట్టిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ప్రభాస్ సైతం ఇలాంటి ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube